భద్రాద్రిలో గాలివాన బీభత్సం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీనితో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
బీసీ హాస్టల్ వద్ద ప్రహరీపై చెట్టు పడి కూలిపోయింది. అధికారులు చెట్లను తొలగించారు. ఆంధ్రా, -తెలంగాణ సరిహద్దుల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు పడిపోయాయి.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T04:22:38Z dg43tfdfdgfd