భర్త కాళ్లు చేతులు కట్టేసి, బట్టలు విప్పి.. వద్దని వేడుకున్నా వినకుండా.. వీడియో చూసి అవాక్కైన పోలీసులు!

భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. భార్యలను భర్తలు కొట్టడం కూడా అప్పుడప్పుడూ చూసేదే. తాగుడుకు బానిస కావడం వల్లో.. ఇతర చెడు అలవాట్ల కారణంగానో కొందరు మగాళ్లు తమ భార్యలను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. దీంతో ఇలాంటి వాళ్ల బారి నుంచి మహిళలను కాపాడటం కోసం మన ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాయి. స్త్రీ వైపు తేడాగా చూసినా తీసుకెళ్లి బొక్కలో వేసేంత కఠినమైన చట్టాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చదవబోయేది దీనికి పూర్తి విరుద్ధమైన ఘటన.

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌ ప్రాంతానికి చెందిన మన్నన్ జైదీ అనే వ్యక్తి గత ఏడాది నవంబర్లో మెహర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే వేరు కాపురం పెడదామని బలవంతం చేసి.. భర్తతో కలిసి ఆమె జీవించడం మొదలుపెట్టింది. అలా వేరు కాపురం పెట్టిన కొద్ది రోజులకే తన భార్యకు మందు తాగడంతోపాటు సిగరెట్లు కాల్చే అలవాటు ఉందని అతడికి తెలిసింది.

ఇదేంటని అడిగితే శారీరకంగా, మానసికంగా అతణ్ని హింసించడం మొదలుపెట్టింది. ప్రతి రోజూ అతణ్ని కొట్టడం, టార్చర్ చేయడం మొదలుపెట్టడంతోపాటు చంపేస్తానని కూడా బెదిరించేదట. దీంతో ఆమె పెట్టే బాధలు భరించలేక ఏప్రిల్ నెలలో మన్నన్ పోలీసులను ఆశ్రయించాడు, ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. పోలీసులు ఏ చర్యలూ తీసుకోలేదు. ఓ మగాడు ఇలాంటి ఫిర్యాదు చేయడాన్ని చూసి వారు నవ్వుకొని ఉంటారు కాబోలు..!

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. తన భార్య పెట్టే చిత్రహింసలకు సాక్ష్యాధారాలు సంపాదించే ఉద్దేశంతో జైదీ.. ఇంట్లో ఓ సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. సరిగ్గా మూడు రోజుల క్రితం ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పోలీసులకు చూపించగా.. వారికి మతిపోయినంత పనైంది.

జైదీకి పాలలో మత్తు పదార్థం కలిపి ఇచ్చిన మెహెర్.. అతడు స్పృహ తప్పిన తర్వాత చీరలు, చున్నీలతో అతడి కాళ్లు చేతులు కట్టేసింది. దుస్తులు విప్పేసి అతడి మీద కూర్చొని సిగరెట్ తాగుతూ.. సిగరెట్‌తో అతడి శరీరాన్ని కాల్చింది. అక్కడితో ఆగకుండా.. ఓ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించే ప్రయత్నం చేసింది. సున్నితమైన ఆ భాగంలోనూ సిగరెట్‌తో చురకలు పెట్టింది. నన్ను వదిలేయమని అతడు ప్రాధేపయడినా వినకుండా చిత్రహింసలకు గురి చేసింది.

తెల్లారిన తర్వాత అతడు ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వీడియో చూశాక.. అతణ్ని హాస్పిటల్‌లో చేర్పించిన చక్ మహదూద్ పోలీసులు.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నన్ను చిత్రహింసలు పెట్టడమే కాకుండా.. నా మీద తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించిందని అతడు వాపోయాడు.

అసలు బాధకరమైన విషయం ఏంటంటే.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.. లేదంటే పెళ్లాడతానని నమ్మించి రేప్ చేశావని కేస్ పెట్టాలా..? అని బెదిరించి మరీ అతడు నిఖా చేసుకోక తప్పనిసరి పరిస్థితిని కలిపించిందట. ఇదంతా చదివాక మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి.. మన్మథుడు సినిమాలో ‘వద్దురా సోదరా..’ అనే పాట లీలగా వినిపిస్తోందా..?

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T14:52:49Z dg43tfdfdgfd