మంత్రి సురేఖపై హైకోర్టులో దాసోజు శ్రవణ్ పిటిషన్

మంత్రి సురేఖపై హైకోర్టులో దాసోజు శ్రవణ్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై బీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌పై లేనిపోని అభియోగాలు మోపి.. ఎలక్షన్​కోడ్​ను ఉల్లంఘించారని ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకునేలా ఈసీకి ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. 

ఇటీవల మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కేటీఆర్‌‌ ప్రమేయం ఉందని తప్పుడు అభియోగాలు చేశారన్నారు. లోక్‌‌సభ ఎన్నికల్లో ఓటర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఓట్లు రాబట్టుకోవాలని మంత్రి ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌‌ను జైలుకు పంపిస్తామని మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకొని.. ఈసీ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై ఈ నెల 8న ఈసీకి మెయిల్‌‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఈసీ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T04:09:45Z dg43tfdfdgfd