మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌

మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌

న్యూఢిల్లీ: తయారీలో సమస్యలు ఉండడంతో యూఎస్ నుంచి కొన్ని మందులను సిప్లా, గ్లెన్‌‌మార్క్ రీకాల్ చేసుకుంటున్నాయి.  యూఎస్ ఎఫ్‌‌డీఏ డేటా ప్రకారం,   సిప్లా 59,244   ప్యాక్‌‌ల ఐప్రాట్రోపియం బ్రోమైడ్‌‌, ఆల్బుటెరోల్‌‌ సల్ఫేట్‌‌ ఇన్‌‌హలేషన్ సొల్యూషన్‌‌ను రికాల్ చేసుకుంటోంది. ఇండోర్‌‌‌‌లోని సెజ్‌‌ ప్లాంట్‌‌లో ఈ మెడిసిన్స్‌‌ను కంపెనీ తయారు చేసింది.  

వీటిని  ఆస్తమా, ఎంపీసిమా వంటి ఊపిరితిత్తుల వ్యాధుల ట్రీట్‌‌మెంట్‌‌లో వాడతారు.  వాల్యూమ్ తక్కువగా ఉందని, లిక్విడ్ డ్రాప్స్ తక్కువగా ఉన్నాయని యూఎస్ ఎఫ్‌‌డీఏ పేర్కొంది. మరోవైపు   3,264 బాటిళ్ల డిల్టియజెమ్‌‌ హైడ్రోక్లోరైడ్‌‌ ఎక్స్‌‌టెండెడ్‌‌ రిలీజ్ క్యాప్సుల్స్‌‌ను గ్లెన్‌‌మార్క్  రీకాల్ చేసుకుంటోంది. ఈ మెడిసిన్స్‌‌ను హై బ్లడ్‌‌ ప్రెజర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌లో వాడుతున్నారు. ఈ మెడిసిన్‌‌ను  గ్లెన్‌‌మార్క్ ఫార్మా యూఎస్‌‌ సబ్సిడరీ రీకాల్ చేసుకుంటోంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:30:11Z dg43tfdfdgfd