ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

  • ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం
  • తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం
  • నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్

నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అన్నారు. సోమవారం నల్గొండ, యాదాద్రి జిల్లా చౌటుప్పల్, పెద్దపల్లిలో నిర్వహించిన బీజేపీ సభల్లో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల పై కాంగ్రెస్​ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. 

రాజ్యాంగం రద్దు, -రిజర్వేషన్లు రద్దు అంటూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఉమ్మడి ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల నుంచి 4 శాతం కోతపెట్టి అప్పటి ప్రభుత్వం ముస్లింలకు కట్టబెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కర్నాటకలో కూడా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నదన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని స్పష్టం చేశారు. 

పాక్ పై సర్జికల్​ స్ట్రైక్స్ చేశాం

పాకిస్తాన్‌‌‌‌పై సర్జికల్‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌ చేసి భారత్‌‌‌‌ సత్తా ఏంటో చూపించామని నడ్డా అన్నారు. కాంగ్రెస్ మాత్రం సర్జికల్ స్ట్రైక్​కు సాక్ష్యాలు అడుగుతోందని విమర్శిం చారు. పదేండ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికా రంలోకి రాగానే ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా  గ్యాస్ అందిస్తామని చెప్పారు.    పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నారని తెలిపారు. బీబీనగర్​కు ఎయిమ్స్ మంజూరు చేశామన్నారు. రామగుండంలో ఆర్ఎఫ్ సీఎల్​ను తిరిగి ప్రారంభించామని, తెలంగాణలో రైల్వే మార్గాన్ని పెంచామని, పెద్దపల్లికి లాభం కలిగేలా నిజామాబాద్ నుంచి ఇండోర్​కు రైలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. 

ఈసారి తెలంగాణలో బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభల్లో ఎంపీ అభ్యర్థులు  సైదిరెడ్డి, బూర నర్సయ్య గౌడ్, శ్రీనివాస్, బీజేపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌‌‌‌రావు, కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణ రెడ్డి, దుగ్యాల ప్రదీప్​రావు, ఎస్.కుమార్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T01:48:05Z dg43tfdfdgfd