మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

భోపాల్ : కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని కాంగ్రెస్ పార్టీ ఎత్తివేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల వారికి అవసరమైన కోటా ప్రయోజనాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ రాహుల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. 

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రజలకు జల్ (నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి)పై హక్కులు కల్పించిందని.. కానీ నరేంద్ర వాటిని తొలగించాలని కోరుకుంటున్నాడని చెప్పారు. బీజేపీ నేతలు తమకు 400 సీట్లు వస్తాయని చెబుతున్నారని.. కానీ వారికి కూడా రావని ఎద్దేవా చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T11:31:26Z dg43tfdfdgfd