మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు

మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు

వికారాబాద్, వెలుగు : గ్రామీణ మహిళలు, యువతులకు ఫ్రీగా బ్యుటీషియన్ ​కోర్సు అందిస్తున్నామని వికారాబాద్​జిల్లా ఎస్​బీఐ లీడ్ మేనేజర్ రాంబాబు తెలిపారు. చిలుకూరు ఎస్​బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి శిక్షణ మొదలవుతుందని, 5 నుంచి 8వ తేదీలోపు సంస్థ డెరెక్టర్​రమేశ్( 85001 65190, 79819 51167)కు కాల్​చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు.19 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వయస్సున్నవారు అర్హులని, 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని, యూనిఫాం, టూల్ కిట్స్ ఇస్తామని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T03:11:21Z dg43tfdfdgfd