మహిళా భక్తురాలికి ప్రత్యక్షమైన శివయ్య.. కొంగు బంగారం చేసే ఆ గుడి ఇప్పుడు చాలా పాపులర్!

శ్రీకాకుళం పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో ఆమదాలవలస గాజులకొల్లివలస గ్రామంలో కొండపైన సంగమేస్వరస్వామి ఆలయం ఉంది. సాధారణంగా సంగమం అంటే నదులు కలిసే ప్రదేశం సంగంమం కానీ ఇక్కడ కొండపైన బౌద్ధం, జైన్ , శైవం ఈ మూడు మతాలు సంగమం వలన ఈ కొండను సంగమేస్వరస్వామి అంటారు. పురాణ ప్రసిద్ధ ప్రకారం పూర్వం జైన దిగంబర సాధువు ఒకరు ఉండేవారు ఆయన దూరంగా ఉండే గ్రామాలకు వెళ్లి ఆహారం తెచ్చుకొని ఈ కొండపై జీవిస్తూ ఉండేవారు.

ఈ కొండ అంతా అరణ్యం కాబట్టి ఎక్కువుగా చుట్టుపక్కల గ్రామాల్లోని గొల్లవాళ్ళు మేతకు మందలను తీసుకు వచ్చేవారు. ఒకసారి ఒక గొల్లవాణి భార్య భోజనం తీసుకొని ఈ కొండకు రాగ అక్కడ  ఒక శివలింగాన్ని చూసింది. ఆమె అప్పటి నుండి ఆమె ప్రతిరోజూ వచ్చి శివలింగాన్ని దర్శించుకొనేది. అలా అందరికి కొండపైన ఉన్న శివలింగం గురించి తెలియగా కాలక్రమేణా సంగమేస్వరస్వామిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు.

ఈ ఇటుకలతో ఇల్లు కట్టారో.. చెక్కు చెదరదు!

ఈ దేవాలయం లో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ కొండపైన ఉన్న సంగమేస్వరస్వామి దర్శనం చేసుకొనేందుకు భక్తులు కార్తీక మాసంలో తండోప తండాలుగా వస్తారు. శివరాత్రి పర్వదినం ఇక్కడ శివలింగానికి భస్మభిషేకం జరుగును. ఆ రోజు శివపరాయనం సామూహిక జగరణలు కార్యక్రమాలు జగరుగుతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు రోజులు పాటు జాతర జరుగుతుంది.

2024-05-05T05:40:55Z dg43tfdfdgfd