మినీ ఆటోనగర్... మన శ్రీకాకుళంలోనే..

ఆటో నగర్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది విజయవాడలోని ఆటోనగర్ కానీ మన శ్రీకాకుళంలో మినీ ఆటోనగర్ ని తపించేలా ఉంది. మన పెద్దపాడు సెంటర్ ఇక్కడ టు విలర్ నుండి లారీ బస్ జేసీబీ హెవీ లిఫ్ట్ క్రేన్ వరకు అన్ని రకాల మెకానిక్ వర్కర్స్ మరియు గ్యారేజ్ లు ఇక్కడ ఉన్నాయి.

ఈ పెద్దపాడు సెంటర్ లో వాహనాలకు కావాలసిన విడిభాగాలు షాప్స్ మరియు వెల్డింగ్ ఫాబ్రికేషన్ షాప్స్ మరియు వాటికి కావల్సిన మెటల్ షీట్స్ అంతే కాకుండా ఇక్కడ ట్రాక్టర్లు తొట్టిలు మరియు లారీ తొట్టిలు ఫాబ్రికేషన్ పనులు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడికి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి వాహనాలు రిపైర్స్ మరియు స్పేర్ పార్ట్ కోసం చాలా మంది నిత్యం వస్తూ పోతూ ఉంటారు.

ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నలుపుగా, సాయంత్రం నీలంగా.. రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏంటి

అందువలన ఈ జంక్షన్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. పెద్దపాడు జంక్షన్ లో కార్స్ ఆటో లారీ ట్రాక్టర్లు మరియు టైర్స్ షోరూమ్స్ ఎక్కవగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి ఈ సెంటర్ లో లభిస్తుంది. ఇక్కడ ఆటో మొబైల్ ఇండస్ట్రీలో కావలిసిన అన్నిరకాల విడి భాగాలు సర్వీసులు లభిస్తుంటాయి.

పెద్దపాడు జంక్షన్ లో ట్రాక్టర్ తొట్టిలు తయారీ చేస్తారు. లారీ తొట్టిలు కూడా ఇక్కడే తయారు చేస్తారు. అంతే కాకుండా అగ్రికల్చర్ మెషిన్ స్పేర్ పార్ట్స్ కోసం ఇచ్చాపురం, పలాస, పాలకొండ, హిరమండలం మొదలగు ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు.

2024-05-04T12:08:13Z dg43tfdfdgfd