మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 దేవాలయాలు.. వెయ్యి జన్మల పుణ్యం దక్కుతుంది..

భారతదేశం గొప్ప చరిత్ర, మతపరమైన సంప్రదాయాలు, అనేక కథలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు. దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువుదీరాయి. ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భక్తులకు, సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలందరూ తప్పక సందర్శించాల్సినవి 9 ఉన్నాయి. అవేంటంటే..

* శ్రీ రామ జన్మభూమి మందిర్, అయోధ్య

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో ఇటీవలే భక్తుల సందర్శన మొదలైంది. జనవరిలో ప్రత్యేక ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయ సముదాయం రాముడి జన్మస్థలాన్ని గుర్తు చేస్తుంది. భారతదేశం గొప్ప సాంస్కృతిక, మతపరమైన వారసత్వానికి అయ్యోధ్య రామాలయం నిదర్శనం.

* రామేశ్వరం ఆలయం, తమిళనాడు

తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయానికి హిందూ పురాణాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. రావణుడిని ఓడించిన తర్వాత రాముడు, సీత మొదట ఇక్కడికే చేరుకున్నారని నమ్ముతారు. యుద్ధం తర్వాత మొదట రాముడు శివుడిని పూజించిన ప్రదేశం కూడా ఇదేనని చెబుతారు.

* వైష్ణో దేవి ఆలయం, కత్రా

ఈ పవిత్ర క్షేత్రం జమ్మూ ప్రాంతంలోని కత్రా పట్టణంలో ఉంది. వైష్ణో దేవిని ఆరాధించడానికి మంచుతో నిండిన కఠిన పరిస్థితుల్లో సవాలుతో కూడిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయినా ఏటా లక్షల మంది ప్రజలు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు.

* బద్రీనాథ్ ఆలయం, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ హిమాలయాల్లో నెలకొని ఉన్న బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని చార్ ధామ్‌లలో ఒకటి. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర స్థలం. మంచుతో నిండిన శిఖరాల మధ్య ఉన్న ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక ఆకర్షణ అందిస్తుంది.

* జగన్నాథ దేవాలయం, పూరి, ఒడిశా

ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథ దేవాలయం వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేవతలు కొలువుదీరిన భారీ రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఆలయ విశేష నిర్మాణం, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా జగన్నాథ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

* కాశీ విశ్వనాథ దేవాలయం, వారణాసి

భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి, కాశీ విశ్వనాథ దేవాలయానికి నిలయం. గంగానది ఒడ్డున నెలకొని ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవికంతో లోతైన సంబంధాన్ని కోరుకునే యాత్రికులను ఆకర్షిస్తుంది.

* కేదార్‌నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌లో సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో భాగం. ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయం సంవత్సరంలో కొన్ని నెలలే అందుబాటులో ఉంటుంది. విపరీతమైన మంచు, ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని నెలలపాటు మూసి ఉంచుతారు.

* గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయం సిక్కు మతం ఆధ్యాత్మిక, నిర్మాణ వైభవానికి చిహ్నం. పవిత్రమైన కొలను చుట్టూ ఉండే ఆలయ బంగారు నిర్మాణం అన్ని మతాల సందర్శకులను ఆకట్టుకుంటుంది. అన్ని మతాలకు చెందిన వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

* సోమనాథ్ ఆలయం, గుజరాత్

భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో సోమనాథ్‌ ఆలయం ఒకటి. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివునికి అంకితం చేసిన ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది.

2024-05-07T12:34:01Z dg43tfdfdgfd