మే 7న ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మే 7న ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.   అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. భానుడి ఉగ్రరూపంతో పగటి పూటే కాకుండా రాత్రి పూట కూడా  జనం విల్లావిల్లాడుతున్నారు. ఏపీలోనూ (Ap) అధిక ఉష్ణోగ్రతలతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీ వాసులకు కూల్ న్యూస్ అందించింది.  ద్రోణి ప్రభావంతో ఈ నెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది.  

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 -నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అటు, ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి సహా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు( మే6) ఏపీ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచాయి.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T12:01:31Z dg43tfdfdgfd