మే నెల పెన్షన్లు ఇంటివద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోండి: ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions News: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్ల విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ ఆదేశాలతో వాలంటీర్ల నుంచి పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని.. మే నెల వృద్ధాప్య పింఛన్లు ఇంటివద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మే 1న వృద్ధాప్య, దీర్ఘకాలిక సమస్యలతో మంచానికే పరిమితమైన వారికి పింఛన్లు ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు, ఏపీ సీఎస్ జవహార్ రెడ్డికి లేఖ రాశారు.

2024-04-27T14:37:15Z dg43tfdfdgfd