రసాయనాలతో మగ్గబెట్టే పండ్లతో ప్రమాదం

రసాయనాలతో మగ్గబెట్టే పండ్లతో ప్రమాదం

  • కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన

ఖైరతాబాద్, వెలుగు: మోతాదుకు మించి రసాయనాలను వాడుతుండగా.. మామిడి, ఇతర పండ్లతో అత్యంత ప్రమాదకరం ఉందని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడారు.  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూల్ ను ఉల్లఘించి  మోతాదుకు మించి రసాయనాలు వాడి పండ్లను మగ్గబెడుతున్నారని, వాటిని తినడంతో  ప్రజల ఆరోగ్యంపై తీవ్ర తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే  ప్రమాదం ఉందని,  ఎఫ్ఎస్ఎస్ఏఐకి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T03:06:57Z dg43tfdfdgfd