రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందన్నారు. నిత్యం దేవుడి పేరు చెప్పుకునే బీజేపీ అగర్‌‌‌‌బత్తీపై కూడా జీఎస్టీ వసూలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మశాస్త్రాన్ని అమలుచేయాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌, ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ బలరాంనాయక్, ఎంపీపీలు సరోజన, ఎంపీటీసీలు పుష్పలత, రమ పాల్గొన్నారు.

మతోన్మాద పార్టీలను తిప్పికొట్టాలి

కామేపల్లి : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కొత్తలింగాల గ్రామంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతోన్మాద పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న బీజేపీ ..  భద్రాచలం అభివృద్ధికి నిధులు ఇచ్చిందా ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:48:15Z dg43tfdfdgfd