రామగుండం అభివృద్ధికి ఏం చేశారని అడిగితే విమర్శలా ?

రామగుండం అభివృద్ధికి ఏం చేశారని అడిగితే విమర్శలా ?

గోదావరిఖని, వెలుగు : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ నటించడంలో దిగ్గజాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​ రాజ్​ఠాకూర్​ ఎద్దేవా చేశారు. శుక్రవారం సింగరేణి జీడీకే 2ఏ గని వద్ద గేట్​మీటింగ్, పోచమ్మ టెంపుల్​వద్ద మున్సిపల్​కాంట్రాక్టు కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామగుండం నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని కొప్పులను ప్రశ్నిస్తే..

సినిమా డైలాగ్స్ చెపుతున్నారన్నారు. సింగరేణి  కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈశ్వర్ ఎందుకు స్పందించలేదన్నారు. సింగరేణి కార్మిక వర్గం చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆయా మీటింగుల్లో మేయర్​ అనిల్‌‌కుమార్, లీడర్లు మహాంకాళి స్వామి, పాతపెల్లి ఎల్లయ్య, ఎండీ ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్​, గట్ల రమేశ్, పులేందర్​ పాల్గొన్నారు.

గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలి 

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, అందుగులపల్లి, రాఘవపూర్, దేవునిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే విజయరమణారావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ దేశంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

రానున్న రోజుల్లో 100  రోజులు ఉన్న కూలీ పని దినాలను 200 రోజులకు చేస్తామని, కూలీ ధరను రూ.400 కు పెంచుతామన్నారు.  ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-04T03:22:28Z dg43tfdfdgfd