రామగుండంలో కొప్పుల ఈశ్వర్ను ప్రజలు నిలదీస్తున్నరు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామగుండంలో కొప్పుల ఈశ్వర్ను ప్రజలు నిలదీస్తున్నరు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పదేళ్ళ  బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ ఇచ్చారో కొప్పుల ఈశ్వర్ చెప్పాలని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ధర్మపురి నియోజకవర్గం లోని పెగడపల్లిలో  పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.  రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ. 70 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేశారని వివేక్ మండిపడ్డారు.  మిషన్ భగీరథ పథకంతో ఎవరికి నీరు అందలేదన్న వివేక్...  రూ. 40 వేల కోట్లు వృధా అని చెప్పారు.  రామగుండంలో కొప్పులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న కొప్పుల కమిషన్లు మింగాడని చెప్పారు.  కొప్పుల కనీసం జూనియర్, డిగ్రీ కాలేజీలు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.  

ఎన్నికల హామీలో బాగంగా ఇప్పటికే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని .. . ఫ్రీ బస్సుతో మహిళలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి .  రూ. 500 లకే గ్యాస్ సిలిండర్,  రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల విలువైన వైద్యం  అందిస్తున్నామని తెలిపారు.  రైతుల రూ. 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు బ్యాంకర్లతో సీఎం రేవంత్  మాట్లాడారని ఆగస్టులో రుణమాఫీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో తాను పోరాటం చేశానన్నారు వివేక్.  కేసీఆర్ సర్కార్ లో జరిగిన అవినీతిని  ప్రశ్నిస్తే వీ6 వెలుగుకు రావాల్సిన రూ. 150 కోట్ల యాడ్స్ ఇవ్వలేదన్నారు వివేక్.  అయినా వెనకడుగు వేయకుండా పోరాటం చేశానన్నారు.  వంశీని పెద్దపల్లి ప్రజలు  ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T09:29:47Z dg43tfdfdgfd