రాష్ట్ర ప్రజలకు అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికీ రోజుకు 300 రూపాయలు.. అర్హులు వీళ్ళే!

ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి సవరించిన కొత్త వేతనం ఇస్తామని తెలిపింది.
గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో MGNREGA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. పేదలకు ఏడాదికి 100 రోజులు పాటు పని కల్పించడం ద్వారా సామాజిక, ఆహార భద్రతను పెంపొందించడం వంటి సముచిత లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
25వ తేదీ ఆగస్టు 2005న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తూ వస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం ఇచ్చే హామీ ఇస్తూ ఈ పథకం తీసుకొచ్చారు.
ఈ పథకం ప్రారంభించిన సమయంలో కూలీలకు ఇచ్చే దినసరి వేతనం రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. అయితే తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను ఏపీలోని కూలీలందరికీ దీనిపై మరో రూ.28 జోడించి ఇవ్వబోతున్నట్లు కేంద్రం తెలిపింది.
ఏప్రిల్‌ నుంచి మొదలు కాబోతున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ న్యూస్ కూలీలను సంతోష పెడుతోంది.
వేసవిలో అనగా మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలల పాటు ఉపాధి పనులు చేసేందుకు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కూలీలు ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఈ పథకం అమలు తర్వాత గ్రామీణ ప్రాంతాలలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. వ్యవసాయ కూలీలకు ఉపాధిపై భరోసా ఏర్పడడమే కాకుండా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం కూడా తగ్గాయని తెలుస్తుంది.
కాగా.. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఇచ్చే వేతాన్ని ఇకపై నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూలీల ఆధార్‌ కార్డుతో లింక్ చేసిన బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

2024-03-29T02:30:31Z dg43tfdfdgfd