రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్

రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం వర్షం కురిసింది. నిన్న మొన్నటి దాకా ఎండలు మండిపోగా కాస్త చినులు కురవడంతో రాష్ట్రంలో వాతావరణం అక్కడక్కడ చల్లబడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్మకొని ఈదురు గాలులు వీచాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అర్థ గంటపాటు వర్షం బారీగా దంచికొట్టింది. నల్గొండ జిల్లాలోనూ అక్కడక్కడ తేలిక పాటి జల్లులు పడ్డాయి. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-05T11:27:39Z dg43tfdfdgfd