రాష్ట్రస్థాయి ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్‌లో పారమిత విద్యార్థుల ప్రతిభ

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ ఐ.యన్.టి.యస్.ఓ‌లో కరీంనగర్ జిల్లా పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అవార్డులను కైవసం చేసుకున్నారు. గణితంలో రాష్ట్రస్థాయిలో వెల్ది.హర్షిణి 7వ తరగతి స్టేట్ 4వ ర్యాంకు, అర్హాన్ లతీఫ్ 8వ తరగతి స్టేట్ 4వ ర్యాంకు, సామాన్యశాస్త్ర విభాగంలో రాష్ర స్థాయిలో యన్.రుషిక 9వ తరగతి స్టేట్ 7వ ర్యాంకు సాధించి పతకాలు, బహుమతులు గెలుపొందారు. అదే విధంగా ఐదుగురు విద్యార్థులు స్ఫూర్తి గణితం, జి.సహస్ర, యస్.సిరి సామాన్యశాస్త్రం, యశ్మిత్ పటేల్, రిధి పబ్బతి ఆంగ్లంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రితేష్ మెహతా తెలిపారు. అలాగే ఇటీవల జరిగిన ఇండియన్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ఐ.యన్.టి.యస్.ఓలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అవార్డులను కైవసం చేసుకున్నారు.

గణితంలో జాతీయస్థాయిలో వెల్ది.హర్షిణి 7వ తరగతి,రెండవ ర్యాంకు... జొన్నల సాయి రిషిత్ 7వ తరగతి, ఐదవ ర్యాంకు, జి.కె. విభాగంలో జాతీయస్థాయిలో భవిక్ 6వ తరగతి, మూడవ ర్యాంకులు సాధించి పతకాలు, బహుమతులు గెలుపొందారని, అదేవిధంగా 16 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఈ.ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు.

ఓటు హక్కు కోసం ఇసుకకు ప్రాణం పోసిన బాలికలు!

ఇవేకాకుండా గతంలో కూడా ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో 500 స్కూల్స్ పాల్గొంటే కరీంనగర్ పరమిత స్కూల్స్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఓ టీవీ ఛానెల్ వారు నిర్వహించిన స్కిల్స్ టాలెంట్ టెస్ట్ లో శుభశ్రీ సాహు అనే అమ్మయి పాల్గొని 2 లక్షల బహుమతి గెలుచుకుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు సంవత్స కాలం పొడువనా ఏదో ఒక కాంటెస్ట్ లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను చాటుతరాని స్కూల్స్ యాజమాన్యం తెలిపారు.

2024-04-24T01:42:01Z dg43tfdfdgfd