రెండుచోట్ల పోటీ చేస్తే తప్పేంటి?:రాహుల్‌కు వయనాడ్ వాసుల మద్దతు
తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లోనూ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన సిట్టింగ్ సీటు వయనాడ్‌లో మళ్లీ బరిలోకి దిగగా.. రెండో ఫేజ్‌లోనే అక్కడ పోలింగ్ పూర్తయింది. దీంతో పాటు శుక్రవారం యూపీలోని రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేయడంపై వయనాడ్ ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించింది.
వయనాడ్‌లో పలువురు ఓటర్లను ఈ విషయంపై కదిలించగా.. ఇండియా కూటమిలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేయడంలో తప్పేముందని పలువురు ఓటర్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ, రాహుల్ రెండుచోట్లా గెలిస్తే వయనాడ్ సీటును ఆయన వదులుకునే అవకాశాలే ఎక్కువని చెప్పారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ రెండుచోట్లా గెలవాలనే కోరుకుంటామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, కొంతమంది మాత్రం రాహుల్ రెండుచోట్లా పోటీ చేయడం సరికాదని అన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-05T03:41:41Z dg43tfdfdgfd