రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి అదిరే శుభవార్త.. ఉచితంగానే..

నిరుద్యోగ యువలకు అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త అందించింది. గ్రామీణ పురుషులకు ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో శిక్షణ అందిస్తోంది. నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుంది. 18.04.2024 నుండి ఇది ప్రారంభం అయ్యింది.

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం సంగారెడ్డి లో ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ లో నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఉంటుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ పురుషులకు (18 సం నిండి ఉండి 45 సం లోపు) ఈ అవకాశం ఉంటుంది. ఉచిత భోజన , వసతి తో పాటుగా ఉచితంగా యూనిఫామ్ ఇచ్చి శిక్షణ ఇస్తామని ,శిక్షణ అనంతరం సర్టిఫికెట్ తో పాటుగా టూల్ కిట్ ఉచితంగా ఇస్తామనిSBRSETI డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

తిరుమల వెళ్తున్నారా.. ఆన్‌లైన్‌లో గదులు దొరక్కపోతే ఇలా చేయండి, మీకు రూమ్ పక్కా..

కావలసిన ధ్రువపత్రాలు: 1.రేషన్ కార్డ్ జిరాక్స్ 2.ఆధార్ కార్డ్ జిరాక్స్ 3.10th క్లాస్ మెమో జిరాక్స్. 10 వ తరగతి చదవని వారు కూడా నేర్చు కొనవచ్చును. 4. నాలుగు passport pass siz photos 5.బ్యాంక్ అకౌంట్ వివరాలు. కాగా పూర్తి వివరాలకు 9490103390, 9490129839 నెంబర్లకు కాల్ చేయొచ్చు.  ఉ 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించగలరు.

2024-05-04T07:37:28Z dg43tfdfdgfd