రైతు బంధు రాని వారి అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం అదిరే శుభవార్త

మీకు రైతు బంధు డబ్బులు రాలేదా? అయితే శుభవార్త. రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే డబ్బులు పొందలేకపోయారో.. అలాంటి రైతులకు మళ్లీ డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా ఈ అంశంపై కీలక ప్రకటన చేసింది. సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. రైతులకు భారీ ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం, ఫ్రీజ్ అవ్వడం వంటి కారణాల వల్ల రైతులకు సాయం అందలేదని వెల్లడించింది. బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరి చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొంది.

ఉద్యోగులకు ఉచితంగానే రూ.7 లక్షలు.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా..

అందువల్ల మీకు కూడా రైతు బంధు డబ్బులు రాకపోతే.. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోండి. మీ అకౌంట్‌ను సరిచేసుకోండి. బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ ఫ్రిజ్ అయ్యిందా? లేదా? అంశాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేసుకోండి. తద్వారా సులభంగానే డబ్బులు పొందొచ్చు.

భారీ శుభవార్త.. రూ.2,700 పతనమైన బంగారం ధర..

మరో వైపు తెలంగాణలో వడగళ్లు, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయింది. దీని వల్ల రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన వెలువడింది. నష్టపోయిన రైతులకు పరిహారం లభించనుంది. రైతులకు పంట నష్టం పరిహారం చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అంటే అటు రైతు బంధు రాని వారికి, ఇటు పంట నష్టపోయిన వారికి ఇద్దరికీ కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.

2024-05-02T01:58:47Z dg43tfdfdgfd