రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్

రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్

బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రైతు భరోసా డబ్బులు వేస్తుంటే అడ్డుకున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు ఎకౌంట్లో వేస్తుంటే అక్కసుతో ఈసీ కి పిర్యాదు చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక బాగా లేకపోయినా రైతు కన్నీళ్లు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి రైతు భరోసా ఇస్తున్నారని తెలపారు.

  పిల్లి వేషాలు వేసి అడ్డుకుని ఇవ్వకుంటే ఇవ్వలేదని గన్ పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇస్తే అడ్డుకుంది ఎవరో తేలుస్తామని చెప్పారు. రైతు వ్యతిరేక ప్రతి పక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలని తెలిపారు. రైతు రుణమాఫీ రూ. 2లక్షలు ఆగస్టు 15వరకు ఒకే సారి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. మే 13 వ తేదీ దాటిన తర్వాత నైనా ఈసీ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు అద్దంకి దయాకర్. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-07T15:35:15Z dg43tfdfdgfd