లక్షల ఫీజులు తీసుకొని సౌలతులు కల్పించరా?

లక్షల ఫీజులు తీసుకొని సౌలతులు కల్పించరా?

  • కార్పొరేట్​ కాలేజీలపై విచారణ జరపండి
  • వెలుగు’ కథనానికి స్పందన

హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పించని కార్పొరేట్​కాలేజీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చైల్డ్​ప్రొటెక్షన్​రైట్స్​కమిషన్ ఆదేశించింది. ఈ నెల 22న ‘వెలుగు’ పత్రికలో వచ్చిన ‘ఐఐటీ, నీట్​ పేరుతో వేల కోట్ల దందా’ వార్తను తెలంగాణ చైల్డ్​ రైట్స్​ ప్రొటెక్షన్​ కమిషన్​సుమోటోగా తీసుకుంది. ‘వెలుగు’ కథనాన్ని జత చేసిన కమిషన్​మెంబర్​ అంజన్​ రావు.. ఘటనపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా ఇంటర్​ బోర్డు కమిషనర్​ను ఆదేశించారు. 

ఇలాంటి దందాలకు పాల్పడుతున్న కార్పొరేట్​ కాలేజీలపై తగిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల వివరాలపై కమిషన్​కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. నారాయణ, శ్రీచైతన్య, అవినాశ్, రెసొనెన్స్​ తదితర కార్పొరేట్​ కాలేజీలు రూల్స్​కు విరుద్ధంగా ఫస్టియర్​, సెకండియర్​ విద్యార్థులకు క్లాసులు చెప్తున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్న వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ పిల్లల హక్కులను హరించేవేనని, కాబట్టి దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T03:28:53Z dg43tfdfdgfd