వాట్సాప్‌లో చాట్ చేసింది.. రూ.73 లక్షలు పోగొట్టుకుంది. ఎలా?

బెంగళూరుకి సంబంధించిన ఓ మహిళ.. కంగారుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. కంప్లైంట్ ఇవ్వాలి అంది. ఏం జరిగింది అని పోలీసులు అడిగితే.. KKR గ్రూప్ అంది. పోలీసులు కళ్లు పెద్దవి చేశారు.. "అమెరికాకు చెందిన షేర్ల కంపెనీ" అంది. పోలీసులు క్యూరియోసిటీతో చూశారు. వివరంగా చెప్పండి అన్నారు. ఆమె ఏం చెప్పిందంటే..

"నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఓ మెసేజ్ వచ్చింది. KKR గ్రూప్ దాన్ని పంపింది. స్టాక్ మార్కెట్‌లో ప్రముఖ కంపెనీల షేర్లు, IPOలను తక్కువ రేట్లకే లభించేలా చేస్తామని మాట ఇచ్చింది. 47 ఏళ్ల నేను.. బెంగళూరులోని వివేకనగర్‌లో ఉంటున్నాను. KKR గ్రూప్ చెప్పింది నిజం అనుకున్నాను. వాళ్లు ఓ వాట్సాప్ గ్రూపులో నన్ను చేర్చుకున్నారు. వాళ్లు చెప్పినట్లుగా నేను జీవితాంతం సంపాదించిన డబ్బు రూ.73.7 లక్షలతో.. KKR గ్రూపులో షేర్లు కొన్నాను. కొన్నాళ్ల తర్వాత కొంత డబ్బును వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాను. కానీ తీసుకోలేకపోయాను. ఆ తర్వాత నన్ను వాళ్లు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. ఆ తర్వాత కాంటాక్ట్ లేదు" అని ఆమె తెలిపింది.

---- Polls module would be displayed here ----

ఇలాంటివి చాలా చూసిన పోలీసులు.. మరో బాధితురాలు అనుకుంటూ.. IT చట్టం కింద కేసు రాశారు. దర్యాప్తు చేస్తున్నారు. "వాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందవచ్చని చెప్పారు. ఇన్వెస్టర్ల కోసమే వాట్సాప్ గ్రూప్ తెరిచామన్నారు. నిజం అనుకున్నాను. త్వరగా మనీ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్ చేశాను" అని ఆమె పోలీసులకు చెప్పింది. జనవరి నుంచి మార్చి మధ్య ఆమె ఈ మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. మనీ విత్ డ్రా కోసం ఆమె ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పెట్టుకున్నాక, ఆమెను గ్రూప్ నుంచి తొలగించారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా కంటాక్ట్ అయ్యేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఆ నంబర్‌కి కాల్ చేసినా లాభం లేకపోవడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.

పోలీసులకు తరచూ ఇలాంటి కేసులు వస్తూనే ఉన్నాయి. చాలా కేసుల్లో నిందితులు విదేశాల నుంచి ఫ్రాడ్ చేస్తున్నారు. అందువల్ల అలాంటి కేసుల్ని పరిష్కరించడం పోలీసులకు వీలు కావట్లేదు. దాంతో బాధితులు నష్టపోతున్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో ఇలాంటి మనీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

2024-03-29T07:45:54Z dg43tfdfdgfd