విశాఖలో ప్రచార బోర్డులు అనుమతికి మంజూరుకి ప్రత్యేక సెల్..

విశాఖలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచార వాహనాలు, అన్ని ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటికీ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. రాజకీయ నాయకులు ఇబ్బంది పడకుండా జీవీఎంసీ ప్రచార బోర్డు అనుమతికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ లోక్ సభ, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్ధులు, వివిధ రాజకీయ పార్టీలవారు ఎన్నికల ప్రచారములో భాగముగా గ్రేటర్ విశాఖపట్నం కార్పోరేషన్ పరిధిలో వున్న కార్పోరేషనుకు చెందిన ప్రచార బోర్డులు, ఇతర అభ్యంతరములు లేని, వివాదాలు లేని, కోర్ట్ పరిధిలోలేని ఇతర ప్రదేశములో ఎన్నికల ప్రచార బోర్డులు ఏర్పాటు చేసుకొనుటకు ఇప్పటి వరకు సంబంధిత అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వారు ద్వారా అనుమతి మంజూరు చేయడం జరుగుచున్నది అని జీవీఎంసీ కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు.

ఇక్కడ ఏ టిఫిన్ అయినా రూ.20 మాత్రమే..

ఇందు నిమిత్తం కొత్తగా ప్రచార బోర్డుల అనుమతి కొరకు, అభ్యర్ధులకు, రాజకీయ పార్టీల సౌలభ్యం కొరకు గాను దరఖాస్తులు స్వీకరించుటకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయములో పోర్టికో వద్ద ఏర్పాటు చేసిన విభాగములో స్పెషల్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ విభాగము కార్యాలయ పని దినములలో ఉదయం 10. గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తాయన్నారు. ఇందుకు సంబందించిన వివరముల కొరకు 73960 45405 ఫోన్ నెంబర్ నందు సంప్రదించాలన్నారు.

వాట్ ఎ ఐడియా సర్ జీ .. ఈ రైతు ఆలోచనతో లాభాలు గడిస్తున్నారు.. అదెలాగంటే !

ఈ అవకాశాన్ని అన్ని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని గమనించి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనుమతులు లేకుండా బోర్డులు ఏర్పాటు చేసినట్లయితే తొలగించడం జరుగుతుందని తెలిపారు. బోర్డులు ఏర్పాటు చేసేందుకు సందేహాలు ఏమైనా ఉంటే తాము పైన తెలిపిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే అన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

2024-04-29T07:47:50Z dg43tfdfdgfd