వీరాంజనేయస్వామికి 12సార్లు మన్యసూక్త అభిషేకాలు.. తరలివచ్చిన భక్తజనం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామి వారి ఆలయం (జోడాంజనేయ స్వామి) ఆలయంలో హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా 12 మన్య సూక్త అభిషేక పూజలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, చాలీసా పారాయణతో పాటు హనుమాన్ దండకాన్ని ఆలయ అర్చకులు లక్ష్మణ పంతులు, అనంతచార్యులు అధ్వర్యంలో నిర్వహించారు.

ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. ఉదయం స్వామివార్లకు ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలతో పాటు పరివార దేవతార్చన పూజా కార్యక్రమాలు సైతం చేసినట్లు తెలిపారు. పూర్ణాహుతి పుణ్యాహవాచన పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత స్వామివారి రథోత్సవం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి దర్శించినా, పూజా కార్యక్రమాలు చేసినా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

చదువు కోసం ముంబై వెళ్లి.. చిత్రకారుడిగా గుర్తింపు.. అక్కడ ఏమి జరిగిందంటే!

ఈ స్వామివారిని దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని,పురాణాలతో పాటు స్థల పురాణం కూడా చెబుతుందని అర్చకులు లక్ష్మణ్ పండితులు తెలిపారు. హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి పాదయాత్రగా కూడా అనేక మంది హనుమాన్ దీక్షాపరులు వచ్చి స్వామివారిని దర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మాల విరమణ చేస్తామన్నారు. ఉదయం స్వామి వారికి సింధూర అభిషేక పూజలతో 12 సార్లు మన్య సూక్త అభిషేక పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Railway Museum: వందేళ్ల నాటి యంత్రాలు ఇవి... ఈ రైల్వే మ్యూజియంలో చూడొచ్చు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమే కాక వివిధ ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి వారి సేవలో తరించారు. హనుమాన్ జయంతి అగ్రహారం ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రం కాషాయ ధ్వజాలతో, దుస్తులతో కనువిందు చేసింది. జై శ్రీరామ్..జై సంకట విమోచన ఆంజనేయస్వామి వారికి జై అంటూ..భక్తులు,స్వాములు నామస్మరణ చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

2024-04-23T15:55:35Z dg43tfdfdgfd