వైఎస్ భారతీరెడ్డి ఎన్నికల ప్రచారం.. 21 రోజుల పాటు అక్కడే

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)

దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే(May)13న జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార వైసీపీ (YCP)కూడా మార్చి 27 నుంచి మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఈపర్యటనలో పార్టీ క్యాడర్ ఉత్తేజపరిచి కార్యకర్తలను ఎక్కువ శాతం పార్టీలోకి, అలాగే ఎన్నికల సమరంలోకి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ (YS Jagan)రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి(YS Bharathi) ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  సీఎం జగన్ తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోసం పులివెందులలో 21 రోజులపాటు వైసీపీ కోసం ప్రచారం చేయనున్నట్లు సమాచారం. భారతీరెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కి సంబంధించి త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భారతిరెడ్డి..

వైఎస్ భారతి గతంలో సీఎం జగన్ తో పాటు, ఆయన తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల కలిసి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ ఇద్దరూ పార్టీ కోసం ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో పులివెందులలో ప్రచారానికి వైయస్ భారతి రూపొందించిన ప్రణాళిక త్వరలో బహిర్గతం కానుంది. వైఎస్ భారతి 2019లో పులివెందులలో ప్రచారం చేసే సమయంలో వైసీపీ తీసుకు వచ్చిన అమ్మ ఒడి పథకం ప్రతి ఒక్కరికి అందజేస్తామని ప్రకటించడం గమనార్హం. అప్పట్లో అది ఈ సంచలన వార్తగా నమోదయింది.  జగన్మోహన్ రెడ్డి మాత్రం స్కూలుకు పిల్లలను పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటనకు వైయస్ భారతి ప్రకటనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పట్లో కొన్ని మీడియాలు వైరల్ చేశాయి.  వైయస్ భారతి ప్రతి పిల్లవాడికి అని సంబోధించినట్లు సమాచారం.

Jagan VS Sunitha: హంతకుడికి ఓట్లేయమని అడుగుతారా.. జగన్‌పై సోదరి సంచలన వ్యాఖ్యలు

పులివెందులలో 21 రోజులు..

మళ్లీ ఇప్పుడు భారతీ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారంటే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంద. టీడీపీ కూడా ప్రస్తుతం అమ్మఒడి పథకం అందిస్తున్న వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు స్కూలుకు వెళ్లే ప్రతి పిల్లవాడికి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మబడి ఇస్తామని ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికి ఒకరికి మాత్రమే అమ్మబడి వచ్చేది అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దీన్ని వైసీపీ నేతలు ఎలా తిప్పికొడతారో చూడాలి.

త్వరలో ప్రకటించే ఛాన్స్..

వైసీపీ తరపున జగన్‌కు తోడుగా భారతీ ప్రచారానికి దిగడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఎన్నికల రంగంలో అడుగు పెట్టారు. తమ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతీ ఊరు తిరుగుతూ సత్యం నిలబడాలని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ గ్యారెంటీ పేరుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు భువనేశ్వరి. అటు అధికార నేత సతీమణి మరోవైపు ప్రతిపక్షనేత భార్య చేస్తున్న ప్రచారంలో ఎవరి అవకాశాలు ఎక్కువ ఉంటాయో తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ సతీమణి భారతీరెడ్డి మాదిరిగానే చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా ఎన్నికల కథన రంగంలో అడిగి పెట్టిందని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారో అని అందరు చర్చించుకుంటున్నారు.

2024-03-28T16:29:25Z dg43tfdfdgfd