వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన కొత్త ధాన్యాన్ని పట్టించి అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. పోచమ్మ పండుగకు బోనాలను సిద్ధం చేసి పెద్దమ్మతల్లి, మాహా లక్ష్మమ్మ, పోచమ్మ ఇలా గ్రామ దేవతలందరి పేరుతో బోనాలు తీస్తారు.

డప్పు వాయిద్యాలు, మహిళలు మంగళ హారతులు, నీటి బిందెలకు వేప తోరణాలు కట్టుకొని గ్రామ దేవతల వద్దకు సందడిగా పెద్ద ఎత్తున వస్తారు. గ్రామ దేవతల మొక్కు చెల్లించుకుంటారు. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం. వర్షాకాల పంట పనులు మొదలుకాక మునుపే ఈ పండగ నిర్వహించుకోవడం తమతాత ముత్తాల నాటి నుంచి వస్తుందని సంఘ పెద్దమనిషి బుర్ల గంగాధాస్ చెబుతున్నారు.

Romantic Movie: ఓటీటీలో హర్రర్ , సస్పెన్స్, రొమాన్స్ మూవీ.. వృద్ధురాలు 20 ఏళ్ల కుర్రాడితో

పోచమ్మ, మైసమ్మ, నల్ల పోచమ్మ, గుండెలమ్మ, మహా లక్ష్మమ్మ, ఐదు చేతులమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఇలా గ్రామదేవతలు అందరికీ ప్రత్యేకంగా బోనాలు తీసి సంఘ సభ్యులంతా డప్పు వాయిద్యాలతో బయలుదేరుతారు. గ్రామ దేవతల చుట్టూ మహిళలు బిందెలతో నీళ్లు పోసి దేవతను తృప్తి పరుస్తారు. అత్తారింటికి ఇచ్చిన అక్క చెల్లెలు బంధువులు అందరిని పిలుచుకొని ఆనందంగా చేసుకుంటామని తెలిపారు.

ఇలా వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతుందన్నారు. ఇలా చేయడంవల్ల పాడిపంటలుసమృద్ధిగా పండుతాయన్నారు. తమ గ్రామంలో అన్ని కులాల వారు కూడా ఈ పండగను ఈ సమయంలో చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

2024-05-07T09:33:33Z dg43tfdfdgfd