వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీది తప్పుడు ప్రచారం .. ఏపీలో మళ్లీ వచ్చేది జగనే అంటున్న జనం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ (YCP)ప్రభుత్వంపై ఓట్ల కోసం టీడీపీ చేస్తున్న ప్రచారంపై ప్రజలే తప్పు పడుతున్నారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ(TDP) వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందులో లోపాలను వెదకడం, దానిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పు దోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా నిరుపేదలు సైతం ఇంగ్లీష్ విద్యను పాఠశాల స్థాయి నుంచే నేర్చుకోవాలని ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నేతలు..ఇప్పుడు ప్రజల భూములు కాజేయడానికే ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద అసత్యప్రచారం చేస్తున్నారని గుంటూరు ప్రాంత రైతులు టీడీపీ తీరును ఎండగడుతున్నారు. భూములకు మరింత భద్రత కల్పిస్తూ అక్రమాలు, కబ్జాలు.. రికార్డుల మార్పిడి వంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడమే కాకుండా ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించి వైసీపీపై విషం చిమ్ముతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు ఏపీ ప్రజలు. మొదట వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు.. తర్వాత వాళ్లను తాము అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తామని చెబుతూనే జీతం కూడా 10వేలు చేస్తామని ప్రకటించడం రెండు నాలుకల ధోరణి కాదా అని ప్రశ్నిస్తున్నారు.

జనం నోట జగన్ మాట..

ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రజల్ని ఓట్లడుగుతుంటే ..ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తోందని మండిపడుతున్నారు జనం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు చంద్రబు తమ స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం పట్టదని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు వైయస్ జగన్ చేపట్టిన ప్రతి పనిని అడ్డుకోవడమే చంద్రబాబు రాజకీయ వ్యాపకంగా పెట్టుకున్నారని .. అందుకు తగిన ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నారు.

Chandrababu| AP Elections: చంద్రబాబు ఎన్నికల హామీలు నీటి మూటలేనా.. సాధ్యసాధ్యాలపై ఆర్ధిక నిపుణుల లెక్కలు

వాలంటీర్ల వ్యవస్థపై పచ్చ విషం..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. అయితే దీన్ని వ్యతిరేకించి జనంలో చంద్రబాబు పలుచన అయ్యారు. వాలంటీర్లు మీద ఇష్టానుసారం కామెంట్లు చేసి తరువాత తీవ్ర వ్యతిరేకత రాగానే నాలుక కరచుకుని... ఇప్పుడు ఆయనే వాలంటీర్లును కొనసాగిస్తానని... పదివేలు జీతం ఇస్తానని చెప్పడాన్ని గుటూరు నియోజకవర్గ పరిధిలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన మస్తానయ్య ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారు.

భూచట్టంపై అసత్య ప్రచారం..

ఇక అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని సైతం అడ్డుకునేందుకు జగన్ కోర్టులకు వెళ్లారని అప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ఇష్టానుసారంగా ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తురని ఆరోపిస్తున్నారు. భూములకు మరింత భద్రత కల్పిస్తూ అక్రమాలు, కబ్జాలు.. రికార్డుల మార్పిడి వంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడమే కాకుండా ప్రజల్లో భూకబ్జా చేయాలని జగన్ చూస్తున్నారనే అసత్య బీజాలను నాటాలని పాకులాడుతున్నారని తప్పు పడుతున్నారు. తనకు చేతకానిది వేరే వాళ్ళు చేస్తే సహించలేని చంద్రబాబు ఇప్పుడు ప్రజలను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ గుంటూరు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద సుబ్బయ్య అనే రైతు బాహాటంగా మీడియాతోనే చెప్పారు.

విమర్శలు తప్ప ఏం చేయలేరు..

ప్రజల్లో పెరుగుతున్న అభిమానం, తండ్రి వైఎస్ లాగే జగన్ అంటే విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తున్నారని .. ఆయన లక్షల ఎకరాల చుక్కల భూములకు రైతులకు హక్కుదారులను చేశారని సుబ్బయ్య పేర్కొన్నారు. లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలు ఇచ్చారని. 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు చెందుతుందంటున్నారు. అంతే కాదు అధికారంలో ఉండగా టీడీపీ ఏం చేయలేకపోయినా ..ప్రజలకు కాస్తో కూస్తో మేలు చేస్తున్న వైసీపీపై అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా లబ్ది పొందాలని చూస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఏది ఏమైనా మళ్ళీ జగనే వస్తాడనే విశ్వాసాన్ని గట్టిగా చెబుతోంది మహిళా రైతు లక్ష్మమ్మ. 175 నియోజకవర్గాల్లో ఒక్క వైసీపీ పాటిపై పోటీ చేసి గెలవలేని టీడీపీ మూడు పార్టీలుగా మూట గట్టుకొని వచ్చినప్పటికి అంతిమంగా ప్రజలు ఓటుతోనే తగిన విధంగా తీర్పు ఇస్తామని చెబుతున్నారు.

2024-05-04T16:38:51Z dg43tfdfdgfd