వైసీపీ మ్యానిఫెస్టో రిలీజ్‌ ప్రోగ్రామ్‌ను చంద్రబాబు చూశారా? వైరల్‌ ఫొటోలో వాస్తవం ఎంత?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ, మరో పక్క తెలుగు దేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికల బరిలో నిలిచాయి. వైఎస్‌ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తోంది. వరుస ప్రచారాలు, రోడ్‌ షోలు, సభలతో రాజకీయ నాయకులు బిజీ బిజీగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు సోషల్‌ మీడియా ప్రచారాలకు డబ్బు వెచ్చిస్తున్నాయి. ఇదే క్రమంలో సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు, ప్రకటనలతో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం సాగుతోంది.

(ఇది newschecker ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫ్యాక్ట్ చేసిన స్టోరీ ఇది)

ప్రచారం:

Screengrab from X post by @johny_ka
Screengrab from X post by @YSJaganTrends

తాజాగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్పించిన వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టోను చంద్రబాబునాయుడు వీక్షిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమెంతో పరిశీలిద్దాం.

* వాస్తవం ఏంటంటే?

వైరల్‌ ఫోటోపై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అసలు విషయం బయటపడింది. రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేసినప్పుడు 2017 నవంబర్ 27 నాటి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్ట్ కనిపించింది. అందులో డిస్‌ప్లే స్క్రీన్‌ ముందు చంద్రబాబు నాయుడు కూర్చున్న ఫొటో కనిపిస్తోంది.

Screengrab from The New Indian Express website

‘వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో నిర్మించిన రియల్ టైమ్ గవర్నెన్స్‌కు సంబంధించిన ఆసియా నంబర్ వన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు.’ అనేది ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనం సారాంశం.

అంతేకాదు 2017 నవంబర్ 26 నాటి ఫేస్‌బుక్ పోస్ట్‌లో నారా చంద్రబాబు నాయుడు  ‘ఈరోజు సచివాలయం మొదటి బ్లాక్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్‌ను ప్రారంభించాం. పౌరుల కోసం నిఘా విభాగం, ఫిర్యాదుల పరిష్కారం, మేజర్‌ ఈవెంట్స్‌, ప్రకృతి వైపరీత్యాల కోసం హెచ్చరిక వ్యవస్థ మొదలైనవాటికి హోస్టింగ్ కోసం ఇ-గవర్నెన్స్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేయడానికి టెక్నలాజికల్లీ అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌, సింక్రనైజ్డ్‌ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది.

Screengrab from Facebook post by N Chandrababu Naidu

ఇది రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని కుటుంబాల డేటాను మేనేజ్‌ చేస్తుంది. ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ద్వారా వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది, ‘పీపుల్ ఫస్ట్’ విధానాన్ని నిర్ధారించే పర్యావరణ వ్యవస్థగా పని చేస్తుంది.’ అని ఉంది. ఈ పోస్ట్‌లో స్క్రీన్ల ముందు చంద్రబాబు నాయుడు కూర్చున్న ఫొటో కూడా ఉంది. స్క్రీన్‌పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రం మాత్రం లేదు.

(L-R) Photo from Facebook post by N Chandrababu Naidu and viral image

* అసత్య ప్రచారం

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోను, ఫేస్‌బుక్‌ పోస్టులోని ఫొటోలు, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌లోని ఫొటోతో పోల్చి చూస్తే అసత్య ప్రచారం జరిగినట్లు స్పష్టమవుతుంది. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను సమర్పించడాన్ని చంద్రబాబు నాయుడు చూస్తున్నట్లు తప్పుగా క్రియేట్ చేశారు. మునుపటి ఫొటోలను డిజిటల్‌గా మ్యానిపులేట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో 2017 నాటిదని స్పష్టమవుతోంది.

(శక్తి కలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా newschecker అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-02T09:30:20Z dg43tfdfdgfd