శుభవార్త.. నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ.. ఆపైన జాబ్!

నేటి కాలంలో వృత్తివిద్య కోర్సులకు అధిక ఆదరణ ఉందనే చెప్పవచ్చు. నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సు ద్వారా వెంటనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీనితో వారు సంస్థలు వృత్తివిద్య కోర్సులను ఉచితంగా అందిస్తూ నిరుద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకుంటున్నారు.

సంగారెడ్డి బైపాస్ రోడ్ లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో ఇప్పటికే ఎందరో నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సుల ద్వారా శిక్షణ పొంది ఉపాధితో సక్సెస్ సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ శిక్షణా కేంద్రం పరిధిలో యువకులకు హౌస్ వైరింగ్ మల్టిపుల్ పర్పస్ శిక్షణను 30 రోజులపాటు నిరుద్యోగులకు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉన్న నిరుద్యోగులు ఈ కోర్సు తీసుకునేందుకు అర్హులు.

గుడిలో దేవత విగ్రహాలు ఉండవు.. కానీ కోరినవన్నీ జరుగుతాయి! ఎక్కడంటే..

నేటి కాలంలో విద్యుత్ వైరింగ్ ద్వారా స్వల్ప కాలంలోనే యువకులు ఉపాధి పొందడం జరుగుతుందని ట్రైనర్ ప్రశాంత్ తెలిపారు. ఇందుకై తాము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్నామని... దీనితో గ్రామీణ ప్రాంత యువకులు పట్టణాలలో ఉపాధి పొంది విజయవంతంగా తమ జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ శిక్షణ పై నిరుద్యోగి ధనుంజయ్ మాట్లాడుతూ వెంటనే ఆటోమేటిక్గా లైట్ వెలిగే ప్రయోగాలను తాము ఈ శిక్షణ కేంద్రంలో నేర్చుకుంటున్నామని తెలిపారు.

2024-05-06T02:14:10Z dg43tfdfdgfd