శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. గోవిందనామాలకు అంతులేదని చెప్పారు. మనసులో ఎంత బాధ ఉన్నా.. శ్రీవారి సన్నిధికి వస్తే బాధలన్నీ మాయమైపోతాయన్నారు. గోవిందా గోవిందా అంటే అష్టకష్టాలు దూరమవుతాయని అన్నారు.

హైదరాబాద్ టీమ్ పై లక్నో గెలవాల్సిందే.. తగ్గేదేలే అంటున్న అభిమాని..

గోవిందుని సన్నిధికి చేరుకుంటే అన్నివిధాలా అందుకుంటారని తెలిపారు. ప్రపంచంలోనే తనకుచాల ఇష్టమైన ప్రదేశం తిరుమల అంటూ ఆమె తెలిపారు. వచ్చే వారంలో టర్కీలో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం కానుందని.... ఆ టోర్నమెంట్ లో తను పాల్గొననున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ ముందు స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పారు.

2024-05-08T15:23:08Z dg43tfdfdgfd