షాకింగ్.. ఈ మద్యం తాగితే గుండె పోటు.. మందుబాబులకు హెచ్చరిక!

మోసంలో రకరకాల మోసాలు ఉంటాయి. మాయల్లో భయంకరమైన మాయలు ఉంటాయి. అలాంటిదే ఈ మాయ కూడా. విశాఖలో హోమియోపతి మందులు కూడా వదలకుండా దాంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. కీలకమైన ఈ విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. అలాగే ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయిన ఆ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నారు. హోమియోపతి మెడిసిన్ లో వాడే చాలా దారుణమైన బెల్లడినో ద్రావకం వాడి.. మద్యం తయారు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కల్తీ చేస్తున్న ఈ బిగ్ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే కొన్ని మద్యం సీసాలు సీజ్ చేసిన పోలీస్ అధికారులు తర్వాత మరిన్నిటి కోసం వెదుకుతోంది.

బరంపురం ప్రాంతానికి చెందిన సుశాంత్ పాత్రో పై గతంలో పలు ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్‌మెంట్ వర్గాల మానిటరింగ్ నిఘాకు తప్పించుకుని తిరుగుతుండడంతో అనుమానం వచ్చింది. దీంతో పెందుర్తి ప్రాంతంలో ఉన్న అతని ఇంటికి వెళ్లారు. అక్కడ సోదాలు చేస్తే, 8 మద్యం బాటిళ్లు లభించాయి. ఇంట్లో సుశాంత్ భార్య శిరీషను పట్టుకుని ఎస్ఈబి అధికారులు విచారించారు. కీలక సమాచారం బయటపడింది. ఆ మధ్యాహ్నం వాళ్ళిద్దరే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు.. అది కూడా ప్రమాదకర కెమికల్స్‌తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నే పెట్టినట్టు గుర్తించారు అధికారులు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఓ మారుమూల ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమనే పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసేస్తున్నారు.

రూ.3.6 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి వెళ్లొచ్చు!

బేలడోనో అనే హోమియో మందును హై డోస్లో వినియోగించి మద్యం తయారు చేస్తున్నారు. ప్రమాదకరమైన ఈ హోమియో డ్రగ్ ను వాడేస్తున్నారు. బేలడోనా డ్రగ్స్ ను హోమియో వైద్యులు కేవలం ఒక చుక్కను డోస్ గా రిఫర్ చేస్తారు. కానీ ఈ కేటుగాళ్లు వాటిని డైరెక్ట్ గా కల్తీ మద్యంలో కలిపేస్తున్నారు. ఈ కల్తీ మద్యం తాగితే గుండెపోటు వచ్చి ప్రాణాపాయం అయ్యే ప్రమాదం ఉందట. ఒరిస్సా నుంచి రప్పిస్తున్న ఈ కల్తీతో పాటు.. హైదరాబాద్ నుంచి ఇంపీరియల్ బ్లూ విస్కీ, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి బాటిల్స్ లో కల్తీ మద్యాన్ని నింపి వాటిని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారని విశాఖపట్నం పోలీసు కమిషనర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.

నేటి నుంచి అకౌంట్లలోకి డబ్బులు!

జరిపిన దాడుల్లో 1,051 లీటర్లతో కూడిన 1,065 బాటిళ్ళ కల్తీ మద్యం, కెమికల్స్ ను సీజ్ చేసిన ఎస్ ఈ బి అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 700 బాటిల్స్ వరకు బెల్ట్ షాపులకు సరఫరా అయినట్టు గుర్తించారు అధికారులు. ఇంపీరియల్ బ్లూ విస్కీ రాయల్ స్టాగ్ స్టెర్లింగ్ రిజర్వ్ బ్రాండ్ల బాటిల్స్ బెల్ట్ షాపుల్లో కనబడితే వాటిని తాగొద్దని సూచిస్తున్నారు పోలీసులు.

2024-05-06T03:29:23Z dg43tfdfdgfd