సింహగిరిపై ఆర్జిత సేవలు..

భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన నారసింహ పుణ్యక్షేత్రాల్లో అతి ప్రాచీనమైనది విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.. విశాఖపట్నంకి సమీపంలోని 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో ఉన్న పర్వత శ్రేణి పై హిందూ పుణ్యక్షేత్రము ఉంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తులు సింహాద్రి అప్పన్నగా పిలుస్తూ కొలుచుకుంటారు.

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఈ నేపధ్యంలోనే శుక్రవారం నుంచి స్వామి ఆర్జితసేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామున సుప్రభాతం, ఆరాధన సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు. అలాగే వేద ఆశీర్వచనాలు, లక్ష్మీనారాయణ వ్రతాలు, సాయంత్రం ఆరాధన సేవల్లో భక్తులు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. కేవలం నామమాత్రపు ధరతో కూడిన టిక్కెట్ తీసుకొని ఆయా ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు.

ప్రచార బోర్డులు అనుమతికి ప్రత్యేక సెల్..!!

నిత్యకళ్యాణం, సహస్రనామార్చన, గరుడసేవ, స్వర్ణపుష్పార్చన తదితర ఆర్జితసేవలు కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం నుంచి 16 రోజులు తరువాత తిరిగి ప్రారంభం అయ్యాయి. కావున భక్తులు ఆయా ఆర్జిత సేవల సమయాలు గమనించి పాల్గొనాలని ఆలయ వర్గాలు పిలుపునిచ్చాయి. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య ఘననీయంగా పెరిగింది.

ఆహ్లాదపరిచే నాగావళి రివర్ వ్యూ పార్క్.. ఇదే..!!

అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కల్యాణానికి లక్షలాది భక్తులు వచ్చి దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు. స్వామివారి కల్యాణం అంతా కూడా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కళ్యాణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఏడాది కళ్యాణం నిర్వహించడం జరిగిందని అధికారులు తెలియజేయడం జరిగింది. వచ్చిన భక్తులకు స్వామివారిని తక్కువ సమయంలో దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 16 రోజులు తర్వాత ప్రారంభమైన ఈ ఆర్జిత సేవలు ప్రతి ఒక్కరు తెలుసుకొని వెళ్లాలని తెలియజేశారు. కళ్యాణం వేడుకలు పూర్తి చేసుకొనిఈ ఆర్జిత సేవలుప్రారంభించడం జరిగిందని తెలిపారు.

2024-04-29T08:03:07Z dg43tfdfdgfd