సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొననున్నారు.  తెలంగాణలో కరీంనగర్, పెద్దపల్లితో పాటుగా పలుజిల్లాల్లో  భారీ వర్షం కురుస్తోంది.  కొన్ని రోజులుగా మండే ఎండలతో ఇబ్బంది పడిన జనం.. చల్లటి గాలులతో ఎంజాయ్ చేస్తున్నారు. 

రాష్ట్రంలో రాబోయే  ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. ఆ తర్వాత మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-07T13:04:50Z dg43tfdfdgfd