సీఎంసీలో కౌంటింగ్​ ఏర్పాట్ల పరిశీలన

సీఎంసీలో కౌంటింగ్​ ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల కౌంటింగ్​ నిర్వహించే డిచ్​పల్లిలోని సీఎంసీ కాలేజీలో ఏర్పాట్లను  ఎలక్షన్​ కమిషన్​ జనరల్ అబ్జర్వర్​ ఎలిస్​వజ్​శుక్రవారం కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతుతో కలిసి  పరిశీలించారు. ప్రతి గదిని విజిట్​ చేసి సూచనలు చేశారు. అర్బన్​, రూరల్​ అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ర్టిబ్యూషన్​ సెంటర్​ మొత్తం పార్లమెంట్​ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగనున్నందున అలర్ట్​గా ఉండాలని ఆదేశించారు.

స్ట్రాంగ్​ రూంలు, కౌంటింగ్​ హాల్స్​ వద్ద సీసీ కెమెరాలు, తాగునీరు, కరెంట్​, కౌంటింగ్​ టేబుల్స్​, కౌంటర్లు తప్పనిసరని సూచించారు. కౌంటింగ్​ నిర్వహించే సిబ్బంది, పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఏజెంట్ల కోసం ఎంట్రీ, ఎగ్జిట్​ వేరువేరుగా ఉండాలన్నారు. సీపీ కల్మేశ్వర్​, నగర పాలక కమిషనర్​మంద మకరంద్​, ట్రైనీ కలెక్టర్ సాకేత్​, డీసీపీ శేషాద్రిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి, లేబర్​ ఆఫీసర్​ యోహాన్​, మెప్మా పీడీ రాజేందర్​ తదితరులు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T05:22:48Z dg43tfdfdgfd