సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు

సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు

సీబీఐ అధికారులమంటూ హైదరాబాద్‌ లోని ఓ వైద్యురాలిని మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు . వైద్యురాలి నుంచి రూ.48 లక్షలు కాజేశారు.  బాధితురాలి పేరు మీదుగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయంటూ సైబర్ నేరగాళ్లు నిందితులు వైద్యురాలికి ఫోన్‌ చేశారు.  సీబీఐ కానిస్టేబుల్‌ను అంటూ బాధితురాలితో మాట్లాడారు.  డ్రగ్స్‌ సరఫరాపై ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారని బాధితురాలికి బెదిరించారు.  బాధితురాలి వాట్సాప్‌నకు అరెస్ట్‌ వారెంట్‌ పంపారు నిందితులు. తమకు  రూ.48 లక్షలు ఇస్తే కేసు క్లోజ్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారు.  

ఇక మరో ఘటనలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు అప్‌డేట్‌ చేయాలంటూ ఓ బాధితుడి నుంచి రూ.5.03 లక్షలు కాజేశారు సైబర్‌ నురగాళ్లు.  హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కాల్‌ చేస్తున్నామని బాధితుడికి ఫోన్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు.  అప్‌డేట్‌ చేయకుంటే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌ అవుతాయని హెచ్చరించారు సైబర్‌ నేరగాళ్లు.  దీంతో సైబర్‌ నేరగాళ్ల మాట విని డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు చెప్పాడు బాధితుడు. వివరాలు చెప్పగానే బాధితుడి ఖాతా నుంచి రూ.5.03 లక్షలు మాయయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-23T15:56:23Z dg43tfdfdgfd