స్కూల్‌కి లేటుగా వచ్చిన టీచర్.. చితకబాదిన ప్రిన్సిపల్.. వీడియోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ఉత్తరప్రదేశ్‌.. ఆగ్రాలోని సీగానా గ్రామంలో.. ఓ ప్రీ సెకండరీ స్కూల్‌లో టీచర్‌ స్కూల్‌కి లేటుగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. గుంజన్ చౌదరిపై ఇంతెత్తున లేచారు.. లేటుగా ఎందుకు వచ్చావ్ అంటూ.. చితకబాదారు. అటు టీచర్ కూడా ఎదురు తిరిగింది. ఇద్దరి మధ్యా పెనుగులాట జరిగింది. ఐతే.. టీచర్‌పై చెయ్యి చేసుకోవడమే కాకుండా.. ఆ ప్రిన్సిపల్.. తన బట్టలు చించేందుకు టీచర్ యత్నించిందని ఆరోపించారు.

వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. ప్రిన్సిపల్ కారు డ్రైవర్ వచ్చి.. ఇద్దర్నీ విడదీశారు. ఆయన కూడా టీచర్‌తో వాదనకు దిగి.. అసభ్యంగా ప్రవర్తించాడు.

"దమ్ముంటే కొట్టు. నువ్వు, నీ డ్రైవర్ ఏం చేస్తారు" అని టీచర్ ఓ దశలో సవాల్ విసరగా.. "ఇక్కడ ఎవరి దాదాగిరీ చెల్లదు" అని ప్రిన్సిపల్ అన్నారు.

ఈ గొడవ జరుగుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ మనకు వినిపిస్తుంది. "ఇదంతా రికార్డ్ అవుతంది. మేడమ్ రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇది మీకు సమంజసమా? ఈ ఫైట్‌లో టీచర్‌కి గాయాలయ్యాయి" అని మరో టీచర్ ఆరోపించారు.

ఈ గొడవ అక్కడితో అయిపోలేదు. స్కూల్ ముగిసిన తర్వాత.. మరోసారి ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. "సిగ్గులేని మనిషి.. స్కూల్‌కి ఆలస్యంగా వస్తోంది" అని మరోసారి ప్రిన్సిపల్ తిట్టినట్లు తెలుస్తోంది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.

మొత్తంగా ఈ ఘటనలో టీచర్‌పై ప్రిన్సిపల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు ప్రిన్సిపల్, ఇటు టీచర్.. ఇద్దరూ అసభ్యంగా తిట్టుకున్నారు. స్కూల్‌లో ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు. వాళ్ల ప్రొఫెషన్‌కి ఇది అస్సలు మంచిది కాదని నెటిజన్లు అంటున్నారు.

---- Polls module would be displayed here ----

"ప్రజలు తమ చిరాకులను, అభద్రతలను ఇతరులపై ముఖ్యంగా పని చేసే సహోద్యోగులపై ఎందుకు చూపుతారు? ఇది అర్థం చేసుకోలేనిది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా..

"ప్రైవేట్ పాఠశాలలు దుకాణాలుగా మారాయి, ఈ ఉపాధ్యాయులు అమ్మకందారులు, పేద తల్లిదండ్రులు కేవలం కస్టమర్లు.. విద్యార్థులకు ఏం బోధిస్తారు.. విసుగు చెందిన ప్రిన్సిపాల్.. కచ్చితంగా ఆమె డిగ్రీలు, డిప్లొమాలూ.. మిల్లుల నుంచి ఉంటాయి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

2024-05-05T14:27:22Z dg43tfdfdgfd