హంతకుడికి ఓట్లేయమని అడుగుతారా.. జగన్‌పై సోదరి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలకు ముందు వైసీపీ(YCP)కి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటి వరకు ప్రజలే నాకు బలం అని చెప్పుకుంటున్న ఆపార్టీ అధ్యక్షుడు , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచార వేదికపై చేసిన వ్యాఖ్యలకు సోదరి డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి(Sunitha Reddy) కౌంటర్ ఇచ్చారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన ఆమె తన తండ్రిని చంపిన రాజకీయ పార్టీకి ఓటు వేయవద్దంటూ ప్రజలకు విన్నవించుకున్నారు. తన తండ్రి చనిపోయి ఐదేళ్లు గడిస్తే ..అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం ఏం చేసిందని వైఎస్ జగన్ ను సునీత సూటిగా ప్రశ్నించారు. చిన్నాన్న అంటే అర్దం తెలుసా తండ్రితో సమానం అంటూ తన సోదరుడు జగన్ ను డైరెక్ట్ గా అటాక్ చేశారు. చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించకుండా చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం, నిందితులకు రక్షణ కల్పించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు సునీతారెడ్డి. తన తండ్రిని చంపిన నిందుతుల వెనక వైఎస్ అవినాష్(Avinash), భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)ఉన్నారని చెబుతున్నారు..వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరి .. ఇప్పుడు మీరే వద్దన్నారు. అంటే మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా అని జగన్ ను సునీత సూటిగా ప్రశ్నించారు.

జగన్ కామెంట్‌కి సునీత కౌంటర్..

ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జరుగుతున్న జాప్యం, నిందితులకు శిక్ష పడకపోవడం వంటి అంశాలతో పాటు హత్య వెనుక ఎవరున్నారనే విషయాన్ని వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతరెడ్డి మీడియా సాక్షిగా బయటపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో దేవుడికి తెలుసని ఎన్నికల ప్రచార సభలో జగన్ చెప్పడాన్ని సునీత ఖండించారు. వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారని అలాంటి పార్టీకి ఓటు వేయవద్దంటూ ప్రజల్ని కోరారు వైఎస్ సునీత. ప్రభుత్వంలో ఉండి ఒక సీఎంగా, సోదరుడిగా మీరు ఏం చేయలేదు కాబట్టే నేను బయటకు రావల్సి వచ్చిందన్నారు.

YS Jagan: వివేకానందరెడ్డిని చంపింది అతడే.. నా ఇద్దరు చెల్లెమ్మలు హంతకుడికి మద్దతిస్తున్నారన్న జగన్

హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఫైర్..

తండ్రి చనిపోయి తాను కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? నాపైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? అంటూ ప్రశ్నించారు.

తన తండ్రిని చంపిన నిందుతుల వెనక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు..వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరి .. ఇప్పుడు మీరే వద్దన్నారు. అంటే మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా అని జగన్ ను సునీత సూటిగా ప్రశ్నించారు. చివరకు నిందితుడ్ని పక్కన పెట్టుకొని ఓటు వేయాలని కోరుతున్నారని ..అతను నిందితుడని సీబీఐ చెబుతున్నా ఓటు వేయాలని కోరడం మీకు తప్పుగా అనిపించడం లేదా అని సునీత వైసీపీ అధినేత జగన్ ను కడిగిపారేశారు.

ఓట్ల కోసమే వివేకా పేరు వాడుకుంటున్నారని కామెంట్..

ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదు. ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారా అంటూ జగన్ ను ఎద్దేవా చేశారు. సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారని విమర్శించిన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె తాను న్యాయం కోసం పోరాడుతున్నానని ..మీరు మాత్రం పదవుల కోసం పోరాడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అందుకే హంతకులకు ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నానంటూ వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచాయి.

బాలకృష్ణకు ఆ స్వామిజీ ఎఫెక్ట్.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ

వైసీపీకి ఓటు వేయవద్దని కోరిన సునీత..

వివేకానందరెడ్డిని చంపిన వాళ్లకు తన చెల్లెమ్మలు షర్మిల, సునీత మద్దతిస్తున్నారని బుధవారం జగన్ చేసిన కామెంట్స్ కే ఈ రియాక్షన్ వచ్చింది. అయితే సునీత చేసిన విమర్శల్లో ఎంత నిజం ఉంది..? హంతకులను చేరదీసే పార్టీలకు ఓట్లు వేయవద్దన్న ఆమె అభ్యర్ధనను ప్రజలు ఏ మేరకు గౌరవిస్తారో చూడాలి. దీనికి రివర్స్ కౌంటర్ వైసీపీ ఎలా ఇస్తుందో అని ఆపార్టీ నాయకులే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

2024-03-28T13:14:10Z dg43tfdfdgfd