హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట్ పాత్ పై నివసించే  భూపాలపల్లి చెందిన పాత నేరస్తుడు పురాణం రాజశేఖర్(19) గత ఫిబ్రవరి 9న రాత్రిపూట ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని పంచముఖ హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల ఆభరణాల తిలకం, మంగళసూత్రాలను, పంచలోహ విగ్రహాలను చోరీ చేశాడు.

వాటిని ట్రాలీలో దాచిపెట్టగా బోలక్ పూర్ కు చెందిన మహమ్మద్ అసిఫ్(28), ఇస్మాయిల్ హుస్సేన్ (23)  చోరీ చేసి పరార్ అయ్యారు. వీరిద్దరిని గత నెల 23న చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ప్రధాన నిందితుడు పురాణం రాజశేఖర్ ను అరెస్ట్ చేసి, సొత్తు రికవరీ చేశారు. అయితే చోరీ సొత్తును ఇతరులకు అమ్మిపెట్టిన బోలక్ పూర్ కు చెందిన మొహినుద్దీన్ (23), మహ్మద్ ఖలీద్ అహ్మద్(31)లను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. చిక్కడపల్లి ఇన్ స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య, ఎస్ఐలు నాగరాజు, కోటేశ్వరరావు, శశిపాల్ రెడ్డి, మౌనిక, సిబ్బంది ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T04:54:50Z dg43tfdfdgfd