హైదరాబాద్​ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్​రావు

హైదరాబాద్​ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్​రావు

  • సిద్దిపేట ఎమ్మెల్యే  హరీశ్​రావు ఆరోపణ

సిద్దిపేట/ హుస్నాబాద్, వెలుగు:హైదరాబాద్​ను ఉమ్మడి రాజధాని కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్నారని.. అయితే చంద్రబాబు లాంటి వాళ్లు దాన్ని అలాగే కొనసాగించేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు.

అలాంటి వాళ్ల ఆటలు సాగకూడదంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో, అక్కన్నపేట మండల కేంద్రంలో రోడ్​షోలో మాట్లాడారు. రిజర్వేషన్లు పోతాయని సీఎం రేవంత్ రెడ్డి.. హిందువుల ఆస్తులు పోతాయని ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మిలో భాగంగా ఇస్తానన్న తులం బంగారం ఎటు పోయిందని సీఎం రేవంత్​ను ప్రశ్నించారు. ఆగస్టు 15 నాటికి ఆరు గ్యారంటీలతో పాటు రైతుల రెండు లక్షల రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్ లో తాను రాజీనామా కు సిద్ధమని అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T02:52:23Z dg43tfdfdgfd