హైదరాబాద్​లో ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా సేవలు షురూ

హైదరాబాద్​లో ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా సేవలు షురూ

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్​’ హైదరాబాద్​లో సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ 2021 యూత్ ఐకాన్ అయిన డాక్టర్ స్రవంతి ఎల్లసిరి ఈ కంపెనీని ప్రారంభించారు. నగరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా లోగోను, కంపెనీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను ఆవిష్కరించారు. 

 ప్లాట్‌‌‌‌లు, ఫ్లాట్లు, విల్లాలు,  కమర్షియల్ ప్రాపర్టీస్‌‌‌‌తో సహా సమగ్రమైన రియల్ ఎస్టేట్ ఆస్తులను తాము అందిస్తామని స్రవంతి ఈ సందర్భంగా ప్రకటించారు. కస్టమర్లు వారి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించిన సమాచారంతో వస్తే వారి  అవసరాలను తీర్చుతామని చెప్పారు. ప్రస్తుతం ఎస్​ ఇన్ఫ్రా డెవలపర్స్ డీటీసీపీ రెరా ఆమోదించిన హిల్ కౌంటీ ప్రాజెక్ట్‌‌‌‌ను బాలానగర్​లో నిర్మిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T01:52:18Z dg43tfdfdgfd