హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వరకు ఎండలు బెంబేలిత్తించగా..  ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఒక్కసారిగా వాతవరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, చింతల్,  అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట్  సికింద్రాబాద్, ఖైరతాబాద్,  నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే రంగారెడ్డి, జగిత్యాల్, సిరిసిల్ల, ఉమ్మడి మెదక్ జిల్లా, కామారెడ్డి, ఆదిలాబాద్ వంటి పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T03:31:02Z dg43tfdfdgfd