హైదరాబాద్‌లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి

హైదరాబాద్‌లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలి ఏడుగురు వలసకూలీలు చనిపోయారు. ఏడుగురు కూడా ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జీ హెచ్ ఎం సి, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది  జేసీబీల సాయంతో 7 మృతదేహాలను వెలికితీశారు.

 బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో అరవింద్ రెడ్డి అనే బిల్డర్ కు చెందిన రైజ్ కన్స్ట్రక్షన్ లో 30 అడుగుల భారీ రిటన్నింగ్ వాల్ కూలిపోయింది. దాని పక్కనే అక్కడ పని చేసే సెంట్రింగ్ కార్మికుల షెడ్ పై పడడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని ఏసీపీ శ్రీనివాసరావు- తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు, 4ఏళ్ల బాబు ఉన్నారు.  బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-08T02:21:51Z dg43tfdfdgfd