హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ
హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్అసెంబ్లీ స్థానానికి సంబంధించి శుక్రవారం ‘ఓట్ఫ్రమ్హోమ్’ మొదలైంది. ఇప్పటికే ఓటుకు అప్లయ్చేసుకున్న 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటు వేయించారు. శుక్రవారం హైదారాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 121 మందికి గాను 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే శుక్రవారం మొదలైన పోస్టల్బ్యాలెట్ఓటింగ్లో 852 మంది అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T04:07:36Z dg43tfdfdgfd