TELANGANA NEWS: అన్నదాతకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంత మంది రైతుల అకౌంట్లలో రైతు బంధు నిధులు జమ అయ్యాయి. దాదాపు 65 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. మరో 5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడాల్సి ఉందని అన్నారు. వారికి కూడా త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. కోడ్ ఎత్తివేసిన తర్వాత రైతుబంధు సాయం చేయనున్నట్లు చెప్పారు.

కాగా, తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకుండా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇది అందరికీ కాదు. గతంలో నిధులు విడుదలై సాంకేతిక కారణలతో రైతు బంధు సాయం రైతుల అకౌంట్లలో పడలేదు. నిర్వహణలోని బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ క్లోజ్, ఫ్రీజ్ కావటం వంటి కారణాలతో పలువురు రైతులకు సాయం అందలేదు. ఈ నేపథ్యంలో వారందరికి ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకుండా డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.

బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరిపి.. ఖాతాలు సరిచేసిన తర్వాత నిధులు అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. కాగా, రూ. 2 లక్షల రుణమాఫీపై కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేయకుంటే తాము అధికారంలో ఉండి ఏం లాభం అని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T02:20:14Z dg43tfdfdgfd