ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా..?

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈనెల 13న పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మే 11న సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఓటర్ స్లిప్పులను ఇంటికి ఇంటికి అందజేస్తున్నారు.

ఎక ఎన్నకలంటే ప్రతి ఒక్కరికి ఠక్కున గుర్తొచ్చేది ఎన్నికల సిరా గుర్తు. చాలా మంది ఎన్నికల్లో ఓటేసిన తర్వాతా సిరా గుర్తును చూపిస్తారు. యువత అయితే సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేసారు. తమ బాధ్యత పూర్తయిందని సింబాలిక్‌గా సిరా గుర్తును చూపిస్తారు. అయితే పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే.. ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే.. అసలు రెండు చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా..? ఏ అంశంపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఓటర్‌కు చూపుడు వేలు, అసలు చేతులే లేకుంటే సిరా గుర్తు ఎలా వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే.. మధ్య వేలికి, అదీ లేకపోతే బొటన వేలికి, అసలు ఎడమ చేయే లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి, అది లేకపోతే మధ్య వేలికి, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు చేతులూ లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ 13న జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సత్తా చాటాలని భావిస్తున్నాయి. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలకు పదనుపెడుతున్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T03:50:32Z dg43tfdfdgfd