ఒంటరిగా ట్రావెల్ చేసే మహిళలు ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సేఫ్.. తప్పకుండా చూడాల్సిన వీడియో

మహిళల భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ సైతం ఏర్పాటు చేసింది. మహిళలు, పిల్లలు, బాలికలపై తరుచూ వేధింపులకు పాల్పడే ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి షీ టీమ్స్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మహిళా భద్రత విభాగం వారి భద్రత కోసం సరికొత్తగా క్యాంపెయిన్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది.

ఆ వీడియోలో ఓ యువతి అర్ధరాత్రి సమయంలో బస్టాండ్‌లో దిగుతుంది. అక్కడే ఉన్న ఓ పెద్దావిడ యువతితో మాట కలపుతుంది. ఎక్కడి వెళ్లాలని అడుగుతుంది. తాను విద్యానగర్ వెళ్లాలని యువతి చెప్పగా.. తాను కూడా అటువైపే వెళ్తున్నానని కావాలంటే నా కారులో డ్రాప్ చేస్తానని చెబుతుంది. ఆమె మాటలు విన్న యువతి కొంత అనుమానంతోనే సరే అని అంటుంది. ఈ లోగా.. 100 నెంబర్‌కు కాల్ చేస్తుంది. ఆ నెంబర్‌కు కాల్ చేయగానే.. ట్రాక్ మీ సర్వీసెస్‌ కోసం 8 నొక్కమని వీఆర్ఎస్ వాయిస్ ద్వారా సూచనలు ఇస్తుంది. 8 నెంబర్ ప్రెస్ చేయగానే..4 డిజిట్ సీక్రెట్ పాస్ కోడ్ మెుబైల్‌కు వస్తుంది. కోడ్ ఎంటర్ చేయగానే.. సదరు యువతి ట్రావెల్ ట్రిప్‌ను తెలంగాణ పోలీసులు కంట్రోల్ రూం ద్వారా మానిటరింగ్ చేస్తారు.

ఆ తర్వాత కొద్ది నిమిషాల్లనే సెప్టీ చెక్ కాల్ ట్రాక్ సర్వీస్ నుంచి సెప్టీ చెక్ కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే.. సేఫ్‌ అయితే 1 ప్రెస్ చేయమని.. నాట్ సేఫ్ అయితే 2 నొక్కమనే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ప్రమాదంలో ఉంటే వెంటనే రెండు నొక్కాలి. అలా నొక్కగానే పోలీసులు వెంటనే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. ఇలా పోలీసు కంట్రోల్ రూం నుంచి పదే పదే కాల్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఫోన్ లిప్ట్ చేయకపోయినా.. పోలీసులు వెంటనే ట్రాక్ చేస్తారు. పోలీసుల విడుదల చేసిన వీడియోలోనూ సదరు యువతిని పెద్దావిడ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మత్తు మందుతో కూడిన కర్చీఫ్ నోటి వద్ద ఉంచటంతో యువతి స్పృహతప్పి పడిపోతుంది. ఆ తర్వాత యువతి ఫోన్‌కు కంట్రోల్ రూం నుంచి కాల్స్ రాగా.. ఆమె లిప్ట్ చేయదు.

దాంతో యువతి ప్రమాదంలో ఉందని గ్రహించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. అక్కడి పోలీసులు యువతి వెళ్తున్న వాహనాన్ని ఛేజ్ చేసి రక్షిస్తారు. ఈ వీడియోను ఒంటరిగా వెళ్లే మహిళలు, ఆడపిల్లలు తప్పకుండా చూడాలని.. అలాగే ఇతరులకు షేర్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T05:28:51Z dg43tfdfdgfd