తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ పలు ఏరియాల్లో వర్షం కురవటంతో నగర ప్రజలు వేసవి వేడి నుంచి ఉపశమనం పొందారు. తాజాగా హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నేడు పలు చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు.

నేడు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మహబూబాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఇక సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా మహాముత్తారంలో 46.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కొల్వాయి, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 46.3 డిగ్రీలు, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 46.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 46.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌, ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T02:53:44Z dg43tfdfdgfd